![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -394 లో....నర్మద దగ్గరికి సాగర్ వస్తాడు. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం నాన్నకి ఎలా చెప్పాలనుకున్నాను.. లక్కీగా నాన్నకి తెలిసింది ఇక నుండి నా లైఫ్ నాకు నచ్చినట్లుగా ఉంటుందని సాగర్ అంటాడు. సాగర్ నీకు కొంచెం కూడా బాధగా లేదా అని నర్మద అడుగుతుంది. ఎందుకు బాధ అని సాగర్ అంటాడు. మీ నాన్న తర్వాత మిల్ బాధ్యతలు నువ్వు తీసుకుంటావని మాటిచ్చావని నర్మద అనగానే నాకు ఇష్టం లేని జీవితాన్ని గడపలేను.. పెద్దోడు ఆ బాధ్యతలు తీసుకున్నాడు.. వాడు మిల్ ని బాగా నడుపుతాడని సాగర్ అంటాడు.
ఆ వల్లి ఫ్యామిలీ మిల్ ని ఏం చేస్తారో ఏం అన్న భయం వేస్తుందని నర్మద అనగానే అలా ఏం కాదు అన్నయ్య చూసుకుంటాడు. నాన్నలాగా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదన్న ఫీలింగ్ నాకు రానివ్వనని సాగర్ వెళ్ళిపోతాడు. మరొకవైపు వేదవతి దగ్గరికి నర్మద వెళ్తుంది. కానీ వేదవతి తనతో మాట్లాడదు. ఆ తర్వాత రేయ్ ధీరజ్ ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయడం అవసరమా ఇంట్లో ప్రొద్దున అంత గొడవ జరిగిందని ధీరజ్ తో ప్రేమ అంటుంది. నువ్వు రాయాలని ధీరజ్, ప్రేమకి దగ్గరగా వెళ్తాడు. అప్పుడే నర్మద వస్తుంది. తనని చూసి ధీరజ్ వెళ్ళిపోతాడు. ఏంటి డిస్టబ్ చేసానా అని నర్మద అనగానే మరి కదా రాక రాక వాడు ఇప్పుడే రొమాంటిక్ యాంగిల్ బయటకు తీస్తుంటే వచ్చావని ప్రేమ అంటుంది. అత్తయ్య నాపై కోపంగా ఉందని ప్రేమకి నర్మద చెప్పగానే ఇద్దరు కిచెన్ లోకి వెళ్తారు. అక్కడున్న శ్రీవల్లిని బయటకు పంపిస్తారు.
వేదవతితో ఇద్దరు మాట్లాడాలని ట్రై చేస్తారు కానీ వేదవతి మాట్లాడదు. అప్పుడే ధీరజ్ వస్తాడు. అమ్మ వాడికి జాబ్ చెయ్యాలని ఉంది కాబట్టి అలా చేసాడని ధీరజ్ అంటాడు. అవును అత్తయ్య ఇప్పుడు సాగర్ జాబ్ చెయ్యడం.. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి.. ఇప్పుడే మాన్పిస్తానని నర్మద అనగానే ఏ తల్లికి కొడుకు జాబ్ చెయ్యాలని ఉండదని వేదవతి అంటుంది. అందరు నా దగ్గర అన్నీ విషయాలు దాస్తారు. ఒక్క నా చిన్నకొడుకు తప్పా అని వేదవతి అంటుంది. అమ్మ నేను కూడా ఒక విషయం దాచాను.. ప్రేమకి రేపు ఎస్ఐ ఎగ్జామ్ ఉంది తీసుకొని వెళ్ళాలి.. ఎలాగైనా నువ్వే ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని బయటకు పంపించాలని ధీరజ్ రిక్వెస్ట్ చెయ్యగానే వేదవతి సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |